
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) చంద్రబాబు నాయుడు కృష్ణానదీ జలాలను 700 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంలో తన నియోజకవర్గంలో నీళ్లు పారిస్తున్నడు. మరి అదే కృష్ణాలో నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నువ్వు విడిచిపెడితే చంద్రబాబు ఒడిసి పడ్తున్నడు. 700 కిలోమీటర్ల దూరంలో ఇవాళ కుప్పంలో గళగళా కృష్ణానదీ జలాలుపారుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు జలహారతి ఇస్తున్నాడు. అంటే నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నవా..? రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.
నిన్న చంద్రబాబు ట్వీట్.. గోదావరి నుంచి 500 టీఎంసీల నీళ్లు నేను పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిన అని.. పట్టిసీమ నీళ్లెత్తి కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలకు, డెల్టాకు ఇవాళ ఏపీ నీళ్లు పారిస్తుంది.. ఎందుకు అక్కడనేమో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ బంద్ పెడితే.. కిందికెళ్లి ఆయన శ్రీశైలంకెళ్లి వెలిగొండకు తీసుకెళ్తున్నడు. కుప్పం తీసుకుపోతున్నడు.. ఇక్కడ గోదావరిలో కన్నెపల్లిలో కటుక ఒత్తుమంటే.. నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకున్నవ్. దేవాదుల దగ్గర కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టు ఉంది.
24 గంటలు మోటార్లు నడుపవయా అంటే నేను 8 గంటలే మోటార్లు నడుపుతా అంటడు. నీళ్లు లేక కాదు ఇది.. ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల. చిత్తశుద్ది లేకపోవడం వల్ల ఇవాళ కరువు పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని హరీష్ రావు అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..