హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు, మెట్రో విస్తరణపై చర్చ.. ఐటీ కారిడార్ ప్రయాణికులకు కొత్త ఆశలు
హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచేందుకు పాడ్ ట్యాక్సీలు, మెట్రో విస్తరణ, ఇతర అనుసంధాన రవాణా వ్యవస్థలపై చర్చ కొనసాగుతోంది.
It corrider


హైదరాబాద్ , 12 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచేందుకు పాడ్ ట్యాక్సీలు, మెట్రో విస్తరణ, ఇతర అనుసంధాన రవాణా వ్యవస్థలపై చర్చ కొనసాగుతోంది. నగరంలో మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు చేరుకోవడానికి ప్రయాణికులు ఎదుర్కొంటున్న చివరి దశ రవాణా సమస్యలను తగ్గించేందుకు కొత్త మార్గాలను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం మెట్రో రైలు ప్రధాన రవాణా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నప్పటికీ, స్టేషన్ నుంచి కార్యాలయం లేదా ఇంటికి చేరుకోవడానికి మరో వాహనం అవసరమయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రయాణాన్ని సాధారణంగా చివరి దశ అనుసంధానం అని పిలుస్తారు. బస్సులు, షేర్ ఆటోలు, క్యాబ్లు, నడక వంటి మార్గాలపై ఆధారపడాల్సి రావడం వల్ల కొంతమంది ప్రయాణికులకు అదనపు ఖర్చు, సమయం భారంగా మారుతోంది.

పాడ్ ట్యాక్సీలు లేదా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థలు ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించబడుతున్నాయి. నిర్దిష్ట మార్గాల్లో చిన్న వాహనాలను ఉపయోగించి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చడం ఈ విధానాల ప్రధాన ఉద్దేశం. అయితే ఈ వ్యవస్థలు ప్రయాణికులకు ఎంతవరకు ఉపయోగపడతాయనేది మార్గాల ఎంపిక, వాహన సామర్థ్యం, టికెట్ ధరలు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.

హైదరాబాద్లో పీఆర్టీ వ్యవస్థకు సంబంధించి మూడు కారిడార్ల ప్రతిపాదనపై ప్రభుత్వం ముందడుగు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande