
కామారెడ్డి, 12 అక్టోబర్ (హి.స.) కరెంటు సరఫరాలో ఇబ్బందులను తొలగించి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు.
వ్యవసాయానికి రోజుకు కేవలం ఆరు గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుండటంతో పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సక్రమంగా విద్యుత్ అందకపోవడంతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని, పంటలకు అవసరమైన సమయంలో నీరు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు.
దీంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..