చిన్నారి హత్య పై బంధువుల ఆందోళన.. డీసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతUPDATE
బొల్లారంలో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి మోజెస్ బంధువుల ఆందోళనతో సోమవారం డీసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Kid


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

బొల్లారంలో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి మోజెస్ బంధువుల ఆందోళనతో సోమవారం డీసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

చిన్నారిని చంపిన నిందితుడు విక్రమ్ ను తమకు అప్పగించాలని బంధువులు డిమాండ్ చేశారు. నిందితుడి వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. డబ్బు కోసం ఐదేళ్ల చిన్నారిని సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

క్లబ్స్ దగ్గర ఉన్న చిన్నారిని సెల్లార్లోకి తీసుకెళ్లి... కాళ్లు, చేతులు కట్టేసి, శరీరానికి పెద్ద రాయి కట్టి నీటి సంపులో పడేశాడు. చిన్నారి చనిపోయిందని నిర్ధారించుకుని.. రాత్రి 7.30 గంటల సమయం'సెల్లార్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

సెల్ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించినట్లు డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande