
నల్గొండ, 12 అక్టోబర్ (హి.స.) పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలంలోని కమ్మగూడెం గ్రామంలో మెరుగు శ్రీలత, సతీష్ల నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి సోమవారం పాల్గొని, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేసి, పేదింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు