మోదీజీ.. మీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు మాతో టచ్లో ఉన్నారు – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
మోదీజీ.. మీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు మాతో టచ్లో ఉన్నారు – రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
RAHUL


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.)

కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 200 మంది అధికారులు ప్రతిపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని అందిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదితర కీలక శాఖలకు చెందిన అధికారులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి, నిష్పాక్షికతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీలో సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్ష కూటమి చేపట్టిన భారీ ర్యాలీకి ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఈసీపై తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయం తమకు తెలుసని, ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చేసిన తప్పును అంగీకరించి, అప్రూవర్‌గా మారి రాజీనామా చేయాలని జ్ఞానేశ్ కుమార్‌కు సూచించారు. ఈ ముసుగు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ ధోబాల్ అని ఆరోపిస్తూ, ప్రధాన కమిషనర్‌ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించి, నగర వీధులను కోటలా, జైలుగా మార్చేశారని రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్న దాదాపు 50 శాతం మంది పోలీసు సిబ్బంది కూడా తమ పోరాటం సరైనదేనని మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం కేవలం మోదీ-రాహుల్ మధ్య పోరాటం కాదని, రాజ్యాంగ పరిరక్షణ మరియు దేశ యువత భవిష్యత్తు కోసం జరుగుతున్న ఉద్యమమని స్పష్టం చేశారు. సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్ కుమార్ తొలగిపోయే వరకు, ఎన్నికల వ్యవస్థలో ప్రక్షాళన జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande