హైదరాబాద్లో కొత్త రవాణా వ్యవస్థకు ప్రణాళిక.. మూడు పీఆర్టీ కారిడార్లకు ఆమోదం
హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ప్రణాళికను పరిశీలిస్తోంది.
Transport


హైదరాబాద్ , 12 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ప్రణాళికను పరిశీలిస్తోంది. నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు మూడు మార్గాలకు ఆమోదం లభించింది.

హైదరాబాద్లో ఐటీ రంగం విస్తరించడంతో రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కార్యాలయాల ప్రారంభం, ముగింపు సమయాల్లో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల ఉద్యోగుల ఉత్పాదకతపై కూడా ప్రభావం పడుతోంది.

ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులకు అనుబంధంగా చిన్న వాహనాలు లేదా ప్రత్యేక మార్గాల ఆధారంగా నడిచే రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంది. పీఆర్టీ వ్యవస్థలో ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లే చిన్న వాహనాలు లేదా పాడ్లను ఉపయోగించే నమూనాలను పరిశీలిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande