పోలీస్ అమరవీరులను స్మరించుకుందాం.. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
Sp


రాజన్న సిరిసిల్ల, 12 అక్టోబర్ (హి.స.) విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట్ గ్రామ శివారులోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పరేడ్ నిర్వహించి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు.

సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుల విధులు, త్యాగాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజల రక్షణలో పోలీసులు పాత్రపై అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌ స్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టనున్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించి, దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకోనున్నట్టు ఎస్పీ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande