యుపిఐ లావాదేవీలపై ఎండిఆర్ విధింపు దీపావళి వరకు వాయిదా
యుపిఐ లావాదేవీలపై ఎండిఆర్ విధింపు దీపావళి వరకు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
यूपीआई के लोगो को प्रतीकात्मक चित्र


यूपीआई और सर्विसेज स्टीयरिंग कमेटी  के जारी लेटर का प्रतीकात्मक चित्र


న్యూఢిల్లీ, అక్టోబర్ 13 (హి.స) పండుగ సీజన్‌కు ముందు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యుపిఐ (UPI) వినియోగదారులకు, వ్యాపారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుండి యుపిఐ లావాదేవీలపై ఎండిఆర్ (MDR) ఛార్జీలను విధించే ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేసింది.

మంగళవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్‌లో యుపిఐ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 15 నుండి అమలు కావాల్సిన కొన్ని రకాల పర్సన్-టు-మర్చంట్ (P2M) యుపిఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధింపును వాయిదా వేసినట్లు పేర్కొంది. దీపావళి తర్వాత దీనిని అమలు చేస్తామని, సంబంధిత తేదీని త్వరలోనే విడిగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

పరిశ్రమలు, వాణిజ్య సంఘాలు, ఫిన్టెక్ కంపెనీలు, పేమెంట్ అగ్రిగేటర్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంలో జరిగే భారీ కొనుగోళ్ల వేళ వ్యాపారులకు, సాధారణ ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ సడలింపు ఇచ్చారు.

యుపిఐ ఎండిఆర్ (UPI MDR) అంటే ఏమిటి?

వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించినప్పుడు, సంబంధిత చెల్లింపు సేవా ప్రదాతలకు (Payment Service Providers), బ్యాంకులకు చెల్లించాల్సిన రుసుమునే 'యుపిఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)' అంటారు.

గత నెలలో యుపిఐ స్టీరింగ్ కమిటీ అక్టోబర్ 15 నుండి ₹2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని ఎంపిక చేసిన P2M లావాదేవీలపై MDR ఛార్జీలు విధించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

--------

హిందూస్తాన్ సమచార్ / Sachin Budhauliya


 rajesh pande