
న్యూఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స.)భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,109 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 358 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు దూసుకెళ్లడం.. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్లపై సమీక్ష జరిగే అవకాశం ఉందనే సంకేతాలు.. మార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్ లాభాలబాట పట్టింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.4.12 లక్షల కోట్లు పెరిగింది. మొత్తంగా ఒక శాతంపైగా మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం మొత్తం మార్కెట్ విలువ రూ.470 లక్షల కోట్లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు