భారత వృద్ధి రేటు 7 శాతం.. ఐఎంఎఫ్ తాజా అంచనాలు విడుదల
భారత దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వేగంతో ముందుకు సాగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) తన తాజా 'వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్' నివేదికలో స్పష్టం చేసింది.
Economics


న్యూఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స.)

భారత దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వేగంతో ముందుకు సాగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) తన తాజా 'వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్' నివేదికలో స్పష్టం చేసింది. 2026- 2027 ఆర్థిక సంవత్సరాల్లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు స్తిరంగా 7.0 శాతంగా నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్, సేవల రంగం విస్తరణ, నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక పురోగతికి ఊతమిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోనుందని సంస్థ అభిప్రాయపడింది.

మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలకడగానే ఉన్నప్పటికీ, ఆ నిలకడ క్రమంగా బలహీనపడుతూ అసమానతలకు దారితీస్తోందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి రేటు 2026 లో 3.1 శాతంగా, 2027 లో 3.4 శాతంగా మాత్రమే నమోదు కావచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.7 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande