పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?
పండగ సీజన్ వేళ భారత్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది.
Gold prices on the rise - no change in silver prices


ముంబై, 14 అక్టోబర్ (హి.స.)పండగ సీజన్ వేళ భారత్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. నేడు (అక్టోబర్ 14) కూడా బంగారం ధరలో భారీ కోత పడింది. మేలిమి బంగారం ధర రూ.1000 మేర దిగొచ్చింది. ఈ వారం ధరలు పతనం కావడం ఇది వరుసగా మూడోసారి.

పలు వెబ్సైట్ ప్రకారం,బుధవారం ఉదయం 10 గంటల సమయానికి 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000కి పైగా తగ్గగా.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారంపై రూ.900కి పైగా దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,260 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల (కిలో) వద్ద స్థిరంగానే కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,410 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,050 గా ఉంది. అలాగే ముంబై, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,260గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది. ఇక చెన్నైలోనూ ఇదే తరహా రేట్లు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande