నాగర్కర్నూల్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మరియు రేపు నాగర్కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
Batti Vijramarka


నాగర్కర్నూల్ , 14 అక్టోబర్ (హి.స.)రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మరియు రేపు నాగర్కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించడంతో పాటు స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అభివృద్ధి పనులలో వేగం పెంచాలని, ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యటనలో భాగంగా రాత్రికి బ్రహ్మగిరి అతిథి గృహంలో బస చేయనున్న ఉప ముఖ్యమంత్రి, వివిధ వర్గాల ప్రజలను, పార్టీ నేతలను కలుసుకుని స్థానిక సమస్యలపై చర్చిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande