ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు: డీఎస్సీ-2026 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 'డీఎస్సీ-2026' (APTRT-2026) సంక్షిప్త నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది.
ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు: డీఎస్సీ-2026 నోటిఫికేషన్ విడుదల


అమరావతి , 14 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 'డీఎస్సీ-2026' (APTRT-2026) సంక్షిప్త నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

సాధారణ పాఠశాలలు (ప్రభుత్వ/జడ్పీ/ఎంపీపీ/మున్సిపల్): స్కూల్ అసిస్టెంట్ (SA) - 906, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) - 1,205 సహా మొత్తం 2,111 పోస్టులు.

గురుకులాలు, ఇతర సొసైటీలు: ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, వ్యాయామ ఉపాధ్యాయుల (PET) పోస్టులు కలిపి మొత్తం 260 ఖాళీలు.

ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఎస్సీ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande