
మేడ్చల్, 14 అక్టోబర్ (హి.స.)
మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం ప్రాంతంలో ఎస్ఐజీ కాలనీ పక్కన ఉన్న స్థలంలో రూ.43.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ టవర్స్' ప్రాజెక్టుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే అర్హులైన నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన, సురక్షితమైన ఆధునిక నివాస సదుపాయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లుగా మంత్రులు తెలిపారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించేలా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఆధునిక నివాస సదుపాయాలు అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న భారీ అద్దె ఇళ్ల భారం పూర్తిగా తొలగిపోనుంది. కేవలం ఇళ్ల నిర్మాణమే కాకుండా, లబ్ధిదారుల సౌకర్యార్థం నాణ్యమైన మౌలిక వసతులను కల్పించడానికి హౌసింగ్ బోర్డు అధికారులు ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు