
కామారెడ్డి, 14 అక్టోబర్ (హి.స.)
ప్రతి గ్రామ పంచాయతీలో రోజూ సగటున 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 90 రోజుల వేతన ఉపాధి కల్పన, రెండో విడత ఇళ్లకు కొత్త అంచనాల తయారీపై బుధవారం సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని, పని కోరే ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని సూచించారు. అధికారులు సమయపాలన పాటించాలని, ఏపీవోలు, టీఏలు ఉదయం 8 గంటలకే, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు ఉదయం 7 గంటలకే విధులకు హాజరు కావాలని ఆదేశించారు. వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాజరు తక్కువగా ఉన్న చోట వివరణ కోరాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు