తుక్కుగూడలో ఉద్రిక్తత: శ్రీశైలం జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాల కూల్చివేత
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలో మున్సిపల్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
Telangana police


హైదరాబాద్ , 14 అక్టోబర్ (హి.స.)రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలో మున్సిపల్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలాన్ని ఆక్రమించి వెలిసిన చిన్న దుకాణాలు, పక్కా నిర్మాణాలను అధికారులు జేసీబీల సాయంతో నేలమట్టం చేస్తున్నారు.

ఈ కూల్చివేతలను స్థానిక వ్యాపారులు, దుకాణదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ చర్యల కారణంగా శ్రీశైలం జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దీగా ఉండే హైవే మార్గంలో అక్రమ ఆక్రమణలను తొలగించడం ద్వారా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande