భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు వాగులో విద్యార్థి గల్లంతు, మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ సమీపంలో విషాదకర సంఘటన జరిగింది.
Water


భద్రాద్రి కొత్తగూడెం, 14 అక్టోబర్ (హి.స.)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ సమీపంలో విషాదకర సంఘటన జరిగింది. సరదాగా ఈతకు వెళ్లిన లేదా ప్రమాదవశాత్తు కాలుజారి తాలిపేరు వాగులో పడి దగ్గుపల్లి బాబి (16) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు, పోలీసులు బాబి మృతదేహాన్ని వాగులో నుండి వెలికితీశారు.

కళ్లముందే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పండుగ వేళ జరిగిన ఈ అకాల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande