తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల


తిరుమల


తిరుమల, 14 అక్టోబర్ (హి.స.)తిరుమల( Tirumala ) వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఈరోజు బుధవారం స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.

దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.

ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 84,179 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 29,644 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం తో పాటు, దర్శన ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande