
అనంతపురం , 14 అక్టోబర్ (హి.స.)
తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సుంకేసుల జలాశయంలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలకు నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా కొంతకాలం నీరు అందించినప్పటికీ, నదిలో నీరు తగ్గడంతో మోటార్లు నిలిచిపోయాయి. జలాశయాన్ని నమ్ముకుని సాగు చేసిన వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
తుంగభద్ర జలాశయం కళ్యాణ కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల తదితర జిల్లాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం పరిధిలోని రైతులు ఇప్పటికే వరి, మిర్చి తదితర పంటలను విస్తారంగా సాగుచేశారు. ఈ పంటలు చేతికి రావాలంటే కనీసం నవంబరు నెలాఖరు వరకు జలాశయం నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆగస్టు 11న జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో 90 రోజుల పాటు అంటే నవంబరు 11వరకు మాత్రమే నీరు ఇస్తామని నిర్ణయించారు.ప్రస్తుత పరిస్థితుల్లో నవంబరు 11కే హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు నీటి సరఫరా నిలిపివేస్తే పంటలు ఎండిపోయి ఎకరానికి రూ.50వేల వరకు నష్టం వాటిల్లుందుని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫలితంగా తుంగభద్ర జలాశయానికి నీటి చేరిక తీవ్ర జాప్యమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV