ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహశీల్దార్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు.
Acb


మేడ్చల్ మల్కాజ్గిరి, 15 అక్టోబర్ (హి.స.) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ కీసర డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) సందీప్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు. ఓ అధికారిక పని నిమిత్తం బాధితుడి నుంచి రూ.2.50 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, పథకం ప్రకారం దాడి చేసిన అధికారులు డీటీ సందీప్ రెడ్డి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీసర తహశీల్దార్ కార్యాలయంలో సోదాల్లో భాగంగా ఇప్పటికే పలు కీలక పత్రాలు, దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande