
మహబూబాబాద్, 15 అక్టోబర్ (హి.స.) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.
గురువారం వారు గూడూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూముల రీ సర్వే పనులను తనిఖీ చేశారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
SIR జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.
అనంతరం గూడూరు మండలంలోని బొద్దుగొండ, మదనాపురం గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..