
ముంబై, 15 అక్టోబర్ (హి.స.)అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు పతనమవుతూ వస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచే రేట్లు డౌన్ అవుతున్నాయి.
పండుగల సీజన్ క్రమంలో చాలామంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మరోవైపు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. బుధవారం ఏకంగా 6.29 శాతం మేర భారీగా క్షీణించిన వెండి.. గురువారం నాటి ట్రేడింగ్లో 0.37 శాతం కోలుకుని ఔన్సుకు $55.944 డాలర్లకు ఎగబాకింది.
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,250 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,890గా ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,48,250గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,890 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,250గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,890 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,400 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,040 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,250 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,890 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.
-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,44,900గా ఉంది.
-చెన్నైలో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ట్రేడవుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV