డిసెంబర్ 18 నుండి 28 వరకు ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్'
హైదరాబాద్ మహానగరం వేదికగా ప్రతి సంవత్సరం జరిగే 'హైదరాబాద్ బుక్ ఫెయిర్' తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది 39వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ను డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు.
Book fair

హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ మహానగరం వేదికగా ప్రతి సంవత్సరం జరిగే 'హైదరాబాద్ బుక్ ఫెయిర్' తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది 39వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ను డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు.

సికింద్రాబాద్ సమీపంలోని ప్రముఖ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 28 వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది.

తెలంగాణతో పాటు దేశ నలుమూలల నుంచి వివిధ పబ్లిషర్లు, రచయితలు, పుస్తక ప్రేమికులు ఈ బుక్ ఫెయిర్లో పాల్గొననున్నారు. మరియు, అన్ని వర్గాల పాఠకులను అలరించే లక్షలాది పుస్తకాలను, డిస్కౌంట్ ధరలలో ఇక్కడ ప్రదర్శించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande