సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోము.. మంత్రి శ్రీధర్ బాబు
సింగరేణి సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నామంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.
Minister


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

సింగరేణి సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నామంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.

సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గత పదేళ్ల పాలనలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం ఒక 'జేబు సంస్థ'గా మార్చుకుందని ఆరోపించారు.

అంతేకాకుండా, సింగరేణికి భారీగా బకాయిలు పెట్టి సంస్థను ఆర్థికంగా దెబ్బతీసింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande