
ముంబై, 15 అక్టోబర్ (హి.స.)
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్
మేనల్లుడు, ప్రముఖ నటుడు ఇమ్రాన్ ఖాన్ కు ముంబై పోలీసులు ఉహించని షాక్ ఇచ్చారు.
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాను తక్షణమే భారత్ను విడిచి వెళ్లిపోవాలని ఆయనకు అధికారిక నోటీసులు జారీ చేశారు.
అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్, వీసా నిబంధనలను ఉల్లంఘించి దేశ వ్యతిరేక ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని భద్రతా యంత్రాంగం నిర్ధారించింది.
ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీలోపు దేశం వదిలి వెళ్లిపోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన బహిష్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు