
అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)
కాట్రేనికోనలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. మహిపాలా చెరువు నుంచి పల్లంకురు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు వేగంగా వచ్చి చెయ్యేరు అగ్రహారం వద్ద ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో మైల దుర్గాప్రసాద్ అక్కడిక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం ఆటో నడుపుతున్న వ్యక్తి అటుగా వెళ్తూ ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరో యువకుడు శిలవరపు శివకార్తిక్ మృతి చెందాడు. మరో యువకుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ