సుప్రీంకోర్టు వరకు ర్యాలీ వ్యవహారం.. రాహుల్ గాంధీ కి నోటీసులు
సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించిన వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.
Rahul Gandhi


న్యూఢిల్లీ, 15 అక్టోబర్ (హి.స.)

సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు ర్యాలీ

నిర్వహించిన వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.

ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. “సుప్రీంకోర్టును ఎవరూ భయపెట్టలేరు. కోర్టు బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలుసు” అని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఇటీవల సుప్రీంకోర్టు దిశగా విపక్ష నేతలు చేపట్టిన ర్యాలీ, కోర్టు ప్రాంగణం వద్ద చోటుచేసుకున్న పరిణామాలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, ప్రాంగణ మర్యాదను కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదనీ ధర్మాసనం తేల్చి చెప్పింది. ర్యాలీ నిర్వహణకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చింది.

కోర్టు ప్రాంగణ నియమ నిబంధనలకు భంగం కలిగించేలా వ్యవహరించడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించినట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande