
న్యూఢిల్లీ, 15 అక్టోబర్ (హి.స.)
హిందూ సామాజికవర్గం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కాబోరని సుప్రీంకోర్టు నేడు స్పష్టం చేసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టమైన తీర్పును వెలువరించింది. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి హిందూయేతర సామాజిక వ్యవస్థలోకి మారిన ఏ వ్యక్తి కూడా బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీలుపడని అంశమని, అలాంటి వాళ్లందిరిక ఈ తీర్పులు వర్తిస్తుందని అని పేర్కొన్నది.
కేవలం మత మార్పిడి జరిగినంత మాత్రాన పూర్వ మతానికి చెందిన కుల ప్రాతిపదికన వెనుకబడిన తరగతుల హోదా గానీ, లేదా బిసి (ముస్లిం) రిజర్వేషన్లుగానీ ఆటోమేటిక్గా సంక్రమించవని కోర్టు స్పష్టం చేసింది. బిసి (ముస్లిం) జాబితాలో ఉన్న నిర్దిష్ట వర్గాల్లోకి కేవలం మతం మారిన ఆధారంగా మాత్రమే ప్రవేశించలేరని, చట్టబద్ధమైన సామాజిక సర్వేలు మరియు అధికారిక నోటిఫికేషన్లు లేకుండా ఈ ప్రయోజనాలు కల్పించలేమని ధర్మాసనం పేర్కొంది.
మతం మారినప్పటికీ వారి సామాజిక, విద్యారంగ వెనుకబాటుతనం మారదని, తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను సమర్థిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని భావించిన కోర్టు, హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. ఇస్లాంలో కుల వివక్ష లేదని, సమానత్వం ఆధారంగా ఉన్న మతంలోకి మారిన తర్వాత పాత కుల హోదాతో రిజర్వేషన్లు కోరడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ సంచలన తీర్పు ద్వారా మత మార్పిడి జరిగిన పిమ్మట బిసి రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి రాజ్యాంగపరమైన ప్రత్యేక ప్రాతిపదిక మరియు వర్గీకరణ తప్పనిసరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు