తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు.. సూర్యాపేట జిల్లా కలెక్టర్
జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
Collector


సూర్యాపేట, 15 అక్టోబర్ (హి.స.)

జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖల వారీగా పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, రెవెన్యూ రీ-సర్వే, భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అధికారులతో సమీక్షించారు.

వర్షాకాలం ముగియకముందే కొన్ని మండలాల్లో భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోవడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

సూర్యాపేట, చివ్వెంల, మునగాల, గరిడేపల్లి, పెన్పహాడ్, మోతె, చిట్యాల, కోదాడ తదితర మండలాల్లో పొట్ట దశలో ఉన్న పంటలకు అవసరమైన నీటిని సమర్థంగా వినియోగించుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande