నేటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులతోపాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ కేంద్రం ప్రకారం..
karnataka-weather-heavy-rain-forecast-in-five-districts-bengaluru-thunderstorms


అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులతోపాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ కేంద్రం ప్రకారం..

ఈ రోజు గురువారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాల సమయంలో ప్రజలు, రైతులు తగిన అప్రమత్తత పాటించాలని అధికారులు సూచించారు.

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, బుధవారం తిరుపతి జిల్లా కలుగుర్తిపాడులో 39.9, చిట్టమూరులో 39.4, విశాఖ జిల్లా పద్మనాభంలో 35.2, తిరుపతి జిల్లా కొత్తగుంటలో 33.6, విజయనగరం జిల్లా డెంకాడలో 29.7, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 28, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 27.5, నెల్లూరు జిల్లా చింతవరం, గూడూరులో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఈశాన్య రుతుపవనాలు మరియు ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, రంగారెడ్డి, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande