ప్రయాణికుడికి గుండెపోటు.....దుబాయ్–హైదరాబాద్ విమానం ముంబయిలో అత్యవసర ల్యాండింగ్
దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎమిరేట్స్ విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబయిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Flight


హైదరాబాద్ , 16 అక్టోబర్ (హి.స.)దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎమిరేట్స్ విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబయిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

విమానంలో ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పరిస్థితిని గుర్తించిన సిబ్బంది అత్యవసర వైద్య సహాయం కోసం చర్యలు చేపట్టారు. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానాన్ని ముంబయి విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా దించారు.

విమానం ముంబయిలో దిగిన అనంతరం విమానాశ్రయ అధికారులు బాధిత ప్రయాణికుడిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే, బాధితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అతడి వివరాలు తెలియలిసి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande