
కామారెడ్డి, 16 అక్టోబర్ (హి.స.)
జనాభా గణన అత్యంత కీలకమైన జాతీయ కార్యక్రమమని, ప్రతి వివరాన్ని ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
జనాభా గణన-2027 రెండవ దశకు సంబంధించి సెన్సెస్ ఛార్జ్ క్లర్క్ లు, సాంకేతిక సహాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అక్టోబర్ 16,17 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో 25 మండలాలు, 4 మున్సిపాలిటీల సిబ్బంది పాల్గొంటున్నారని, 40 రకాల ప్రశ్నల ద్వారా సమాచార సేకరణ, సీఎంఎస్ పోర్టల్ ప్రక్రియపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు