
అమరావతి , 16 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడడం, ఎన్నికల నిబంధనలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షింస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ నుంచి ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అనేక దశలు ఉంటాయి. ఈ ప్రక్రియలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చూడటం అధికారులకు ముఖ్యమైన బాధ్యత. ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా ఉండటం ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అవసరం.
ఎన్నికల పరిశీలకులు సాధారణంగా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం, సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం, ఫిర్యాదులను పరిశీలించడం, ఎన్నికల సంఘానికి నివేదికలు అందించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఇతర స్థానిక ఎన్నికల ప్రక్రియకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నందున ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఓటర్లు ఎన్నికల నిబంధనలను పాటించడం కూడా అవసరం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్