పిల్లల ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్ ప్రతిమసింగ్
మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసం - 2026 ముగింపు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమసింగ్ ఘనంగా నిర్వహించారు.
Collector

మెదక్, 16 అక్టోబర్ (హి.స.)

మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ పోషణ మాసం - 2026 ముగింపు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమసింగ్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..పిల్లల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలను నిరంతరం అందించాలని తెలిపారు.

ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవాలని, పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు వయస్సు అవసరాలకు అనుగుణంగా సమతుల ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

9వ జాతీయ పోషణ మాసం -లో భాగంగా నెల రోజుల పాటు పోషణ ప్రాముఖ్యత, పోషణ్ ట్రాకింగ్, జన ఆందోళన్, సమతుల ఆహారం, పోషకాహారం వంటి అంశాలపై గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు, కిషోర బాలికలు, పిల్లలకు అవగాహన కల్పించారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande