మానవ జోక్యం లేకుండా వాహనాల ఫిట్నెస్ పరీక్షలు.. మంత్రి పొన్నం ప్రభాకర్
మానవ జోక్యం లేకుండా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక అడుగు వేసింది.
Minister


హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

వాహనాల ఫిటెనెస్ పరీక్షలను అత్యాధునిక టెక్నాలజీతో, అత్యంత పారదర్శకంగా, మానవ జోక్యం లేకుండా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక అడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి రూ.425.50 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో ఒక్కో స్టేషన్కు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.296 కోట్లకు అనుమతులివ్వగా, ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఒక్కో స్టేషన్ వ్యయాన్ని రూ.11.50 కోట్లకు పెంచుతూ తాజాగా సవరించిన నిధులను ఆమోదించినట్లుగా ఆయన పేర్కొన్నారు. మొత్తం రెండు దశల్లో ఈ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande