రైతు శ్రేయస్సు ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడం వలన సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎస్సారెస్పీ నుండి సాగునీరు విడుదల చేయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.
Mla


పెద్దపల్లి, 16 అక్టోబర్ (హి.స.) పెద్దపల్లి

జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడం వలన సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎస్సారెస్పీ నుండి సాగునీరు విడుదల చేయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.

డి 83, డి 86 ప్రధాన కాల్వల ద్వారా పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజక వర్గాలకు సరఫరా అవుతున్న నీటిని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎస్సారెస్పీలో నీరు తక్కువగా ఉన్నా ప్రభుత్వాన్ని ఒప్పించి మంత్రి శ్రీధర్ బాబు సహాకారంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించామని తెలిపారు.

రైతుల ఇబ్బందులను తొలగించడమే తమ ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande