
రాయచోటి , 16 అక్టోబర్ (హి.స.)రాయచోటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో రెండు పార్టీల నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో వాహనాలకు నిప్పంటించారు.
పలు వాహనాలు ధ్వంసం కాగా పలు కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. కానిస్టేబుల్ పెంచలయ్యకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలకు గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్