
న్యూఢిల్లీ, 16 అక్టోబర్ (హి.స.) సీజెపి
'తిరంగా నిరసన' నేపథ్యంలో ఢిల్లీలోని కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్థాను మూసివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ నిర్ణయం వల్ల వ్యాపారులకు నష్టం వాటిల్లినట్లు తెలిస్తే, రాజ్యాంగ పరిహార అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్ మూసివేతపై ఢిల్లీ కిరాణా కమిటీ, ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ జై అనంత్ దేహద్రాయ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దసరా పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ సెంట్రల్ పార్క్ నిరసనలు, ఎన్డీఎంసీ విధించిన ఆంక్షల వల్ల రోజుకు దాదాపు రూ.200 కోట్ల మేర వ్యాపార లావాదేవీలకు విఘాతం కలుగుతుందని, ఇది చిన్న వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీ లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. పండుగ రోజుల్లో చిన్న షాపుల యజమానులు తమ జీవనోపాధిని పొందుతారని మాకు తెలుసు. ఇలాంటి సమయంలో వ్యాపారాలకు అంతరాయం కలిగితే ఆ కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు మాకు అర్థమవుతాయని కామెంట్ చేశారు. ఇదే అంశంపై జస్టిస్ జాయా మాల్యా బాగ్చీ కూడా రియాక్ట్ అయ్యారు. వ్యాపారులకు నష్టం కలిగిందని కోర్టు భావిస్తే.. రాజ్యాంగ పరిహార నియమాల ప్రకారం నష్టపరిహారం ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..