
హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)
యూనిఫామ్ లో ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘించి అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు.
పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రైవేటు కార్యక్రమాల్లో డ్యాన్సులు చేయడం, సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
ఇటీవల, కొంతమంది పోలీసు సిబ్బంది వివాహాలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో యూనిఫాం ధరించి డ్యాన్సులు చేస్తున్న వీడియోలను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇటువంటి వీడియోలు కొన్ని సందర్భాల్లో వైరల్గా మారాయి.
ఈ ధోరణి, పోలీసు విభాగంలో ఉండాల్సిన క్రమశిక్షణ, యూనిఫామ్ కి ఇవ్వాల్సిన గౌరవంపై చర్చకు దారితీస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..