దేశ యువత హృదయాల్లో అజిత్ దోవల్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు .. కిషన్ రెడ్డి
ఎన్నికల సంఘం, ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే జ్ఞానేశ్ కుమార్, ఈవీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
Kishan Reddy


హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

ఎన్నికల సంఘం, ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిస్తే జ్ఞానేశ్ కుమార్, ఈవీఎంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

రాహుల్ గాంధీ దిగజారి మాట్లాడుతున్నారని, దేశంలో ఓటు చోరీ జరగలేదని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ను వదిలిపెట్టబోమని రాహుల్ గాంధీ అంటున్నారని, ఆయన దాదాగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరును కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

దేశ యువత హృదయాల్లో అజిత్ దోవల్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో ఓట్ చోరీ జరగలేదని, చోరీకి పాల్పడేవారికి ప్రజలు ఓట్లు వేయడం లేదని అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) తో సంబంధం లేకుండానే గతంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో విజయం సాధించిందని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తీర్పులు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తులను తప్పుపడుతున్నారని విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande