
హైదరాబాద్ , 17 అక్టోబర్ (హి.స.)ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో కీలక బాధ్యతలు చేపట్టనున్న నూతన ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి జాతీయ పోలీసు అకాడమీ వేదికగా నిలుస్తుంది. అయితే, నేడు జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ హాజరుకానున్నారు. 151 మంది ఐపీఎస్లు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో నిర్వహించే పాసింగ్అవుట్ పరేడ్కు పోలీసు వ్యవస్థలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అధికారుల సామర్థ్యాన్ని, క్రమశిక్షణను, దేశసేవ పట్ల వారి నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
భారత పోలీసు సేవ (ఐపీఎస్)లోకి ఎంపికైన అభ్యర్థులకు అకాడమీలో వివిధ అంశాలపై శిక్షణ అందిస్తారు. నేర పరిశోధన, చట్టాల అమలు, అంతర్గత భద్రత, ప్రజా సంబంధాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ వంటి అంశాల్లో వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. పోలీసు అధికారి కేవలం నేరస్థులను పట్టుకునే వ్యక్తి మాత్రమే కాకుండా, ప్రజల హక్కులను పరిరక్షిస్తూ సమాజంలో న్యాయం, భద్రత, విశ్వాసం పెంపొందించే బాధ్యతాయుతమైన అధికారి కావాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కొనసాగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్