
హైదరాబాద్ , 17 అక్టోబర్ (హి.స.)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దంపతులను సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి కళానిధి మారన్ కలిశారు. కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులు తమ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ల వివాహ రిసెప్షన్కు హాజరుకావాలని కేటీఆర్, ఆయన భార్య శైలిమను కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు.
కళానిధి మారన్ భారతీయ మీడియా, వినోద రంగంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన నేతృత్వంలోని సన్ గ్రూప్ టెలివిజన్, సినిమా, రేడియో, డిజిటల్ మీడియా వంటి పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకు విస్తృతమైన ప్రేక్షకాదరణ ఉంది. ముఖ్యంగా తెలుగు, తమిళం సహా పలు భాషల్లో వినోద కార్యక్రమాలు, సినిమాలు, వార్తా ప్రసారాల ద్వారా సంస్థ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్