అమ్మవారి అలంకరణకు స్వర్ణ కమలాలను సమర్పించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి పూజ కోసం స్వర్ణ కమలాలను కానుకగా సమర్పించింది.
Lotus


అమరావతి , 18 అక్టోబర్ (హి.స.)మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి పూజ కోసం స్వర్ణ కమలాలను కానుకగా సమర్పించింది. ఉదయం ఇంద్రకీలాద్రికి వచ్చిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి అలంకరణ కోసం తెచ్చిన రెండు స్వర్ణ పుష్పాలను కనకదుర్గమ్మ మూలవిరాట్ సన్నిధిలో ఉంచారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో ఆలయ ఈవో శీనా నాయక్‌కు రశీదుతో సహా పసిడి పుష్పాలను అందజేశారు. అమ్మవారి అలంకరణకు అదనపు శోభను చేకూర్చేలా నిష్ణాతులైన స్వర్ణకారులు అత్యంత నైపుణ్యంతో 22 క్యారెట్ల మేలిమి బంగారంతో ఈ పుష్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ రెండు స్వర్ణ కమలాల బరువు 280.25 గ్రాములుగా ఉంది. దసరా నవరాత్రి పర్వదినాన అమ్మ వారికీ ఈ స్వర్ణ కమలాలు కానుకగా సమర్పించి మొక్కు చెల్లించుకున్నట్లు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande