MVSR కాలేజీ ఘటనపై తీవ్ర ఆందోళనలు
హైదరాబాద్ శివారులోని నాదర్గుల్ ఎమ్వీఎస్ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కాలేజీలో జరిగిన దాండియా వేడుకల సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి మృతి చెందిన విద్యార్థిని సోన
Students protest


హైదరాబాద్ , 18 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్ శివారులోని నాదర్గుల్ ఎమ్వీఎస్ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కాలేజీలో జరిగిన దాండియా వేడుకల సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి మృతి చెందిన విద్యార్థిని సోనా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు భారీ ఆందోళనలు చేపట్టారు.

కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థిని సోనా కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలని, బాధ్యులైన కాలేజీ యాజమాన్యం మరియు నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ గేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వేడుకలు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లోనూ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా కూడా అదనపు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande