అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం
అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దేవస్థానం ఎదురుగా ఉన్న బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
Fire


అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)

అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దేవస్థానం ఎదురుగా ఉన్న బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

బాధితుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. సిలిండర్లను పోలీసులు తొలగించడంతో త్రుటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. మంటల్లో మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్ డ్రింక్ షాప్, రెండు హోటళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande