ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల పరిశీలనపై అధికారుల దృష్టి
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల స్వీకరణ ముగియడంతో సోమవారం అభ్యర్థులు సమర్పించిన పత్రాల పరిశీలనపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు.
Elections


అమరావతి , 19 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల స్వీకరణ ముగియడంతో సోమవారం అభ్యర్థులు సమర్పించిన పత్రాల పరిశీలనపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున పెద్ద సంఖ్యలో పత్రాలు సమర్పించడంతో ఎన్నికల కార్యాలయాల్లో సందడి నెలకొంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 19న జరగనుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 21 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టమవుతుంది. అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు షెడ్యూల్ ఖరారైంది.

విజయవాడలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పట్టణ స్థానిక సంస్థల్లో కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 86 వార్డు స్థానాలకు 968 నామినేషన్లు, మేయర్ పదవికి 24 నామినేషన్లు వచ్చాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande