
అమరావతి , 19 అక్టోబర్ (హి.స.)మహర్నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 19, సోమవారం సాధారణ సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14, రెండో శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాల్సి ఉంటుందని ప్రకటించింది.
దసరా పండుగ సమయంలో మహర్నవమికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజున అనేక ప్రాంతాల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అమ్మవారి ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబాలు, భక్తులు పండుగ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ఉపయోగపడుతుంది. అయితే సాధారణ సెలవు ప్రకటించడమంటే అన్ని అత్యవసర సేవలు నిలిచిపోతాయని కాదు. ఆసుపత్రులు, అత్యవసర వైద్య సేవలు, పోలీసు శాఖ, అగ్నిమాపక సేవలు వంటి విభాగాలు తమ అవసరాలను బట్టి పనిచేస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్