ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఎల్కే అద్వానీ
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఎల్కే అద్వానీ
Lk Advani


న్యూఢిల్లీ, 19 అక్టోబర్ (హి.స.)

మాజీ డిప్యూటీ ప్రధాని, బిజెపి సీనియర్ నేత ఎల్కే అద్వాని ఆరోగ్యం మెరుగుపడింది. మూడు రోజుల చికిత్స అనంతరం ఆయన్ను ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్ను ఆయన్ను అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్టోబర్ 19వ తేదీన ఆస్పత్రి చేసిన ప్రకటన ఆధారంగా.. న్యూరాలజీ డాక్టర్ వినీత్ సూరీ పర్యవేక్షణలో అద్వానీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande