ఆసియా పారా గేమ్స్ లో సత్తా చాటిన భారత షూటర్ మోనా అగర్వాల్.. ప్రధాని మోడీ అభినందనలు
ఆసియా పారా గేమ్స్ లో సత్తా చాటిన భారత షూటర్ మోనా అగర్వాల్.. ప్రధాని మోడీ అభినందనలు
Modi


న్యూఢిల్లీ, 19 అక్టోబర్ (హి.స.)

అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత పారా షూటర్ మోనా అగర్వాల్ మరోసారి సత్తా చాటారు. ఆసియా పారా గేమ్స్-2026లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, పోటీల రికార్డును నెలకొల్పి దేశం గర్వించేలా చేశారు. ఈ అద్భుత విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మోనా ప్రతిభ, పట్టుదల, లక్ష్యంపై ఏకాగ్రతను ప్రశంసించారు. భారత్ పతకాల ఖాతాను ఘనంగా తెరిచిన ఆమె విజయం క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎన్హెచ్1 (SH1) విభాగంలో మోనా అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశారు. మొత్తం 250 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆసియా పారా గేమ్స్ రికార్డును నెలకొల్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande